Sunday, May 14, 2017

భాష - ఆర్థిక వ్యవస్థ - సామాజిక సంబంధాలు

భాష - ఆర్థిక వ్యవస్థ - సామాజిక సంబంధాలు
గారపాటి ఉమామహేశ్వరరావు
హైదరాబాదు విశ్వవిద్యాలయం

భాషలు ప్రపంచ  సాంస్కృతిక వారసత్వ ఆనవాళ్లు.
జనం ఆలోచనలనూ జీవన విధానాన్నీ ప్రతిబింబించేవి భాషలే.
చారిత్రిక సాంస్కృతిక వైవిధ్యంలో  భాషల పాత్ర కీలకం.
భాషాధ్వంసం జీవ ధ్వంసమే.
జీవ వైవిధ్యంతోనే సృష్టి మనుగడ, భాషావైవిధ్యంలోనే మానవ మనుగడ.
భాషావైవిధ్యం ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
అమ్మ నుడితోనే ఆకలి అంతం.

1.0    పరిచయం:
సమాజంలో భాషకూ సంపదకూ అవినాభావ సంబంధం ఉంది. భాషతో సంపదను సృష్టిస్తాం. ఇది, భాషను ప్రత్యేక పరిస్థితులలో వాడే ఉపాధ్యాయులూ, రచయితలూ, పాత్రికేయులూ, నటులూ మొదలైనవారికి మాత్రమే పరిమితం కాదు.  భాషను వాడేవారందరికీ సంబంధించినది.  బతకడానికి చేసే ప్రతి పనీ సంపద సృష్టితో ముడిపడివున్నదే. ఈ నేలపై బతికేవారందరూ సంపద సృష్టిలో పాలుపంచుకొనేవారే. సంపద సృష్టికి భాష ఒక ప్రధాన సాధనం. భాషలు సమాజంలోని ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేస్తాయి. ఇది చెప్పడానికి వేరే రుజువులు అవసరంలేదనుకుంటాను. అదేవిధంగా, సమాజంకూడా భాషకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలపై  ప్రభావం చూపించవచ్చు. ఇంకా చెప్పాలంటే,  సమాజంలోని వ్యక్తుల ఆర్థిక పరిస్థితి భాషతో ముడిపడివుంటుంది. ఈ సందర్భంలో భాషల ఆర్థిక విలువల గుర్తింపు అవసరం.  ప్రతి భాషకూ దాన్ని మాట్లాడే  సమాజంలో అంతర్లీనంగా ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది. ఒక ప్రత్యేక దృక్కోణంలో, భాషను వ్యక్తి ఆర్థిక సామర్ధ్యానికి ప్రతీకగానూ సామాజిక శక్తిగానూ పరిగణించాలి.

                                       భాషాపరమైన  విలువలలో అనేక ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి. ప్రతి వ్యక్తికీ  భాష ఒక నిధి వంటిది.  భాష వ్యక్తినీ సమాజాన్నీ   కలిపివుంచుతుంది.    సామాజిక వ్యవస్థకు   భాషే   పునాది.    వ్యక్తికీ   ఆర్ధికవనరులకూ మధ్య సంబంధాలలో భాషకు సంబంధించిన   విధి విధానాలు ఉన్నాయి.  ఒక క్రమబద్ధమైన రీతిలో భాషకూ   ఆర్ధికవ్యవస్థకూ మధ్య అనుబంధం  ఉంటుంది. ఇందులో ఒక సైద్ధాంతిక భావన ఉంది.  కొన్ని భాషలు మరికొన్ని భాషల కంటే ఎందుకు ఎక్కువ అవసరం అనిపిస్తాయి? కారణం వాటిమధ్యనున్న ఆర్థిక వ్యత్యాసాలు కావచ్చు.   భాషలమధ్యనున్న  ఈ ఆర్థిక వ్యత్యాసాల  ప్రభావం  ఆ సమాజాలపై ఉంటుంది.   భాషల ఎంపికలో సూక్ష్మ  ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి.   భారతదేశంలాంటి మిశ్రమ సామాజిక నేపధ్యంలో,  సమాజంలోని చిన్నా పెద్దా ఆర్థిక  విషయాలూ వాటి ప్రయోజనాలు   విభిన్న భాషా సమూహాల పరస్పర ఆమోదంతో వ్యక్తం చేయబడతాయి.    భిన్న భాషా సమూహాల పరస్పర  ఆమోదం  ఫెడరల్ వ్యవస్థకు ఆయువుపట్టు.   అట్లాగే,   భాషలకు సంబంధించిన   ఆర్ధిక విధానాలు సమాజాలలోని  జాతులూ - భాషల సహజీవనాన్ని ప్రభావితం చేస్తాయి. జాతులూ తెగల వైవిధ్యాన్నీ,   అల్పసంఖ్యాక భాషల  ప్రోత్సాహానికి దోహదం చేసేవీ భాషలమధ్యనున్న ఆర్ధిక సంబంధాలే. సమాజపు ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం భాష.   భాషలకు వాణిజ్యపరమైన సామర్ధ్యం  ఉంటుంది. అంటే  సమాజంలో స్థానిక వాణిజ్య శక్తులు బలపడడానికి స్థానిక భాషల ఆర్థిక స్థాయి పెరగాలి.  స్థానిక భాషల ఆర్థిక స్థాయిలో పెరుగుదల  ఆ సమాజపు ఆర్థిక శక్తికి నిదర్శనం.  సమాజంలోని విస్తృత ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా   భాషే ఆధారం.  సమాజంలోని వ్యక్తులమధ్య సంబంధాలు భాషా పరంగా  ముడిపడి ఉంటై. అంటే సమాజపు   ఆర్థిక వ్యవస్థకు భాషే పునాది. భాషా సంస్కృతులు ఒక సమాజపు ఆర్ధిక పురోభివృద్ధిని ప్రభావితం చేయగలవు.   బహుళ సాంస్కృతిక సమాజాలలో, భాషా ప్రణాళికలూ   భాషా ప్రయోజనాలూ సామాజిక  ఆర్థిక కోణంలో ప్రత్యక్ష సంబంధాలకు సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.

2.0   అశాస్త్రీయ బోధనాపద్ధతి ఇంగ్లీషు మాధ్యమం:
బోధన అనేది మాతృభాషలో జరగడం సహజం. అట్లాకానిది అసహజం. మాతృభాషలో లేని బోధన అశాస్త్రీయం ఇంకా అనాగరికం. బోధన మాతృభాషలోనే ఉండాలి అనేందుకు  కారణాలు అనేకం ఉన్నాయి. విద్యార్థులు మాతృభాషలో నేర్పు, పటిమ కలిగి ఉంటారు. మాతృభాషలో మాట్లాడేందుకు   ఎట్లాంటి అరమరికలూ, బెరుకు ఉండవు. మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం కలిగిఉంటారు. మాట్లాడేటప్పుడు తత్తరపాటు సిగ్గుపడటం ఉండదు. ప్రశ్నించడం మాతృభాషతోనే మొదలవుతుంది. మనోవైజ్ఞానిక భాషాశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం పసివయసులో నేర్చిన భాష విద్యాబోధనకు అన్ని విధాలా అనువైనది.  ఇక బోధనా భాషగా అధిక సంఖ్యాకుల మాతృభాష ఉండటం సహజం. ప్రజల భాషలో బోధన ప్రజాస్వామిక భావనకు ఆలంబన. దీనికి విరుద్ధ భావనే పరభాషలో విద్యాబోధన. విదేశీ భాషలో విద్యాబోధన అనుచితం. ఇప్పటివరకూ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలోనూ పాఠశాల విద్య మాతృభాషలోనే కొనసాగిస్తున్నారు. ఇదే  సామాజిక, పౌర న్యాయ సూత్రాలకు అనుగుణంగా నడిచే పద్ధతి. ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ కూడా ప్రభావశీలకమైన, ప్రయోజనకారకమైన విద్యకు మాతృభాషా మాధ్యమమే కీలకమని చెబుతోంది. అంతేకాదు, పాఠశాలలో బోధనా భాషగా మాతృభాష లేనప్పుడు, పిల్లలు బడిమానేయడం  లేదా మొదటి తరగతులలోనే తప్పటం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా, ఇప్పటివరకూ జరిగిన ఎన్నో పరిశోధనలు, పిల్లలు తల్లి ఒడినుండి  బడికి చేరేటప్పుడు చదువుకు సరైన భాష మాతృభాషే అని నిరూపిస్తున్నాయి (యునెస్కో, 2008 ఎ).  తల్లిదండ్రుల డిమాండు  ఉందంటూ,   కొన్ని విద్యా వ్యవస్థలలో కొన్ని సార్లు  మాతృభాషకాని భాషలలో బోధన  నిర్ణయం  సమర్ధనీయంకాదు. ఇట్లాంటి బోధన పద్ధతులు,   మాతృభాషలను మినహాయించడం కాదు ఆ భాషలను మాట్లాడే పిల్లలనుకూడా బోధననుండి తప్పిస్తున్నట్లు  పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అన్నమాటలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, మీరు ఎవరికైనా వారికి అర్థమయ్యే భాషలో  చెప్పితే, అది వారి తలకు ఎక్కుతుంది! నిజమే, కానీ మీరు వారి భాషలో  చెప్పితే మాత్రం  గుండెలకు హత్తుకుంటుంది.

ఉపాధి అవకాశాలను   మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఉన్నత విద్యా మాధ్యమంగా మాతృభాషకు బదులు  పరిథులు లేని ప్రత్యామ్నాయంగా నేడు ఆంగ్ల భాషను  ఎంపిక చేసుకోవడం   రేపటి ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. సామాజిక, మానవీయ శాస్త్రజ్ఞులూ విద్యావేత్తలూ, పరిశోధకులూ ప్రాథమిక విద్యా మాధ్యమంగా ఆంగ్లాన్ని మాతృభాషా స్థానంలో నిల్పే ప్రయత్నం  తప్పు అని భావిస్తుండగా కొందరు మాత్రం  ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పెరుగుతున్న  విద్యార్థుల సంఖ్యనూ  ఎప్పుటికప్పుడు విస్తరిస్తున్న ఆంగ్ల మాధ్యమ పాఠశాలలనూ చూపించి ఇంగ్లీషుమాధ్యమాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ప్రభుత్వాలు  కేవలం డిమాండు-సరఫరా విధానాన్ని అమలుచేసే సంస్థలుగా కాక   భవిష్యత్తులో సమాజానికి ఏది మంచిదో అది ఆలోచించి చేసే సంక్షేమ ప్రభుత్వాలుగా ఉండాలి.    ధూమపానం,  మద్యం వినియోగం వంటి అనారోగ్య అలవాట్లకు అత్యంత అధిక డిమాండ్ ఉన్నా   మనం వాటిని నియంత్రణలో పెట్టను వెనుకాడడం లేదు గదా.  మరి భాషావిధానంలో సహజ సూత్రాలకు విరుద్ధంగానూ సమాజ సంక్షోభానికి దారితీసే అనారోగ్య పద్ధతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు. భాషా సామాజిక శాస్త్రవేత్తల  అభిప్రాయం కోసం ఎందుకు  సంప్రదించటం లేదు.   నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి  ఆంగ్లభాషా మాధ్యమంతో ఏక భాషావిధానాన్ని అమలుపరచడం ప్రభుత్వాల   హ్రస్వదృష్టి విధానానికి ఇది నిదర్శనం. ఇది ఒక దేశం పట్ల  ఆ దేశ ప్రజల పట్ల అనాలోచిత ప్రవర్తనే.

2.1 ముందుచూపు మందగించిన ప్రభుత్వవిద్యావిధానం:
గత ప్రభుత్వాలు, విద్యా విభాగంలో తమ బాధ్యతను తగ్గించుకొనేందుకు ప్రైవేటు యాజమాన్యంలో ఇంగ్లీషు మీడియంకు  అపరిమితంగా ముందూ వెనుకలు చూడకుండా అనుమతులు మంజూరు చేశాయి. 2003 నుండే మునిసిపాల్టీ, ప్రైవేటు యాజమాన్య స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టేందుకు మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న 95 శాతం స్కూళ్లు ఇంగ్లీషుమీడియంలోనూ, 98 శాతం ప్రభుత్వ స్కూళ్లు తెలుగుమాధ్యమంలోనూ నడుస్తుండగా, వాటిల్లో ప్రైవేటు (ఇంగ్లీషు మీడియం) స్కూళ్లు అన్నీ పట్టణాలలోనూ, తెలుగు మీడియం స్కూళ్లలో చాలాభాగం పల్లెటూళ్లలోనూ ఉన్నాయి. ఐతే, పల్లెటూళ్లలో ఉన్న చిన్నకారు రైతుకుటుంబాలూ వ్యవసాయ కార్మిక కుటుంబాలూ సాంప్రదాయవృత్తులవారూ షెడ్యూల్డు కులాలూ తెగల కుటుంబాలకూ చెందినవారు ఆంగ్లభాషామాధ్యమంలో చదివే సదుపాయం లేనందువలననూ, అట్లాంటి ఆంగ్లభాషా మాధ్యమ సదుపాయాన్ని  పల్లెటూళ్లకు విస్తరించే విధంగా ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనుకున్నారు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా    'సక్సెస్' ప్రణాళిక పేరుతో ఇంగ్లీషు మీడియంను అమలుచేసేందుకు వీలుగా,  ఉన్న ఇంగ్లీషు మీడియమ్ స్కూళ్ల పని బావుంది అంటూ  తీర్మానించారు.  కానీ ఇట్లాంటి కీలక తీర్మానానికి ముందస్తుగా ఎలాంటి నివేదికనూ తయారుచేయించినట్లు లేదు. దీనికి అనుగుణంగా, 2008 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జి.ఓ.ను (ఎమ్.ఎస్.నం. 76) విడుదలజేసింది. దాని ప్రకారం, 6500 స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించింది.    ప్రైవేటు యాజమాన్యంలో వచ్చే ఉద్యోగావకాశాలను అందుకునేందుకు వీలుగానూ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొనేందుకు వీలుగా ఆంగ్లమాధ్యమం అవసరం అంటూ తేల్చేసింది.

2.2 ఆంగ్లమాధ్యమంతో విద్యాబోధన- అక్షరాస్యతకు అడ్డుగోడ:
               తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2011-12 గణాంకాల ప్రకారం 1 వ తరగతిలో 15 లక్షలకు పైగా పిల్లలు ప్రవేశం పొందుతుంటే 8 వ తరగతికి చేరుకొనేటప్పటికి 15%, 10 వ తరగతికి 28%,   12వ తరగతికి చేరుకొనేటప్పటికి 46% మంది బడి మానేస్తున్నారు. 6, 9,  11 తరగతులలో చాలా స్కూళ్లలో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టడమే  బడిమానేసేవారి  సంఖ్య పెరుగుదలకు కారణం. అంటే మన జనాభాలో 1వ తరగతినుండి 12వ తరగతివరకూ చదివేవారు మొత్తం 1 కోటీ 87 లక్షలకుపైగా ఉండాల్సివుండగా   వీరిలో బడిమానేసేవారు షుమారు 40 లక్షలమంది వరకూ ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో బడిమానేసెయ్యడానికి బలవత్తరమైన కారణాలలో ఒకటి ఇంగ్లీషు మాధ్యమం. 2003-4 సంవత్సరాలలో 6, 9, 11 తరగతులలో ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మాధ్యమమే ప్రధానకారణం. లక్షలాదిగా బడిమానేసిన పిల్లలు    ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకూ, పట్టణ మురికివాడలలో ఉంటున్న పేద కుటుంబాలకు చెందినవారు అని గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే,  అక్షరాస్యత తక్కువ ఉన్న ఇతర రాష్ట్రాలలోకూడా బడిమానేసే పిల్లలు ఎక్కువ ఉన్నచోట ఆంగ్లమాధ్యమాలు ఎక్కువ ఉండడం కనిపిస్తోంది. ఆంగ్లమాధ్యమం- బడిమానేయటం- నిరక్షరాస్యతల మధ్య ఒక సూత్రప్రాయ సంబంధం ఉన్నట్లు కనబుడుతోంది. ఇది వెనుకబడిన వర్గాలూ, పేద కుటుంబాల పిల్లలు ఇంగ్లీషు మీడియం క్లాసునుండి ఇంటికి వచ్చినతర్వాత మళ్లీ క్లాసుకు వెళ్లేవరకూ వారు ఇంగ్లీషులో నేర్చినవిషయాలకు ఎట్లాంటి సహాయక ప్రోత్సాహకాలు అందకపోవడమూ, క్లాసులోనే నాణ్యతలోపించిన ఇంగ్లీషు మాధ్యమ బోధనలూ కారణాలు.                  

తెలుగు రాష్ట్రాలలో వివిధ మాధ్యమాలలో విద్యాబోధనకూడా ఇదే విషయాన్ని గుర్తుచేస్తోంది. 5వ తరగతినుంచి 6వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థుల సంఖ్యలో తెలుగు మాధ్యమంలో గణనీయమైన తరుగుదల కనిపిస్తోంది. ఐతే ఇందులో ఒక విశేషం ఏమంటే ఈ తరుగుదలకు సమాంతరంగా ఆంగ్లమాధ్యమంలో ప్రవేశంపొందుతున్నవారి సంఖ్య పెరుగుదలకు దరిదాపుల్లో ఉంది. అంటే ఆరవతరగతిలో తెలుగు మాధ్యమ ప్రవేశాలు తగ్గించివేశారన్నమాట. తెలుగుమాధ్యమ బడులను తగ్గించడమూ  తెలుగుమాధ్యమ ప్రవేశాలను కుదించివేయడంతో ఇంగ్లీషు మాధ్యమ ప్రవేశాలు ఊపందుకున్నాయి అని చెప్పాలి. దీన్ని ఈ కింది పట్టిక నిరూపిస్తోంది. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్లో 5వ తరగతినుండి 6వ తరగతికి తెలుగు మాధ్యమంలో ప్రవేశానికిలో 24 శాతం పైగా తరుగుదల ఉంటే అదే ఇంగ్లీషు మాధ్యమంలో 21 శాతం పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో అయితే తెలుగు మాధ్యమంలో 17 శాతం తగ్గితే ఇంగ్లీషు మాధ్యమంలో 11 శాతం పెరిగారు. తెలుగు మాధ్యమంలో తరుగుదల, ఇంగ్లీషు మాధ్యమంలో పెరుగుదల, తగ్గిన తెలుగు మాధ్యమ పాఠశాలలనూ, ప్రవేశాలనూ సూచిస్తుంది. ఈ అంచనా సరైనదేనని 6వ తరగతినుంచి 10వ తరగతికి తెలుగు మాధ్యమంలో ప్రతి ఏడాదికీ తరుగుదల గణనీయంగా తగ్గితే, ఆంగ్ల మాధ్యమంలో మాత్రం తరుగుదల గణనీయంగా పెరిగింది. ఆంధ్ర ప్రదేశ్లో తెలుగు మాధ్యమంలో 6 నుంచి 10వ తరగతి వరకు 14 శాతం దాకా తరుగుదల కనిపిస్తే ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రం 31 శాతం పైగా తరుగుదల కనిపిస్తోంది. అంటే ఇంగ్లీషు మీడియంలో చేరినవాళ్ళు 30 శాతందాకా మధ్యలో ఆపేసి వెళ్లిపోతున్నారన్నమాట. ఇదే వైపరీత్యం తెలంగాణలో ఇంకా ఎక్కువగా కనబడుతోంది. తెలంగాణలో తెలుగు మాధ్యమంలో తరుగుదలకు బదులు పెరుగుదల, ఇంగ్లీషుమాధ్యమంలో తరుగుదల ఇంకా పెరిగి 35 శాతానికి ఎందుకు చేరిందో మన విద్యా ప్రణాళికలు మదింపు చేసే అధికారులూ నాయకులూ ఆలోచించాలి.


పట్టిక-1 తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో *తరగతులవారీ   మాధ్యమాల వారీ
విద్యార్థుల ప్రవేశాలు (2013-14)
క్ర.సం.

తరగతి
తెలుగుమాధ్యమం
ఆంగ్లమాధ్యమం
ఇతరాలు
మొత్తం
1.
ఆంధ్ర ప్రదేశ్
I
453708
300861
16242
770811
2.
II
476043
277364
16944
770351
3.
III
481262
273150
17573
771985
4.
IV
491540
263428
17106
772074
5.
V
477155
272458
16499
766112
6.
VI
359994 (-24.55%)
345669(+21.18%)
8273
713939
7.
VII
369884(+2.74%)
332898(-03.69%)
8198
710980
8.
VIII
363447(-01.74%)
302318(-09.19%)
7152
672917
9.
IX
358279(-01.42%)
268370(-11.23%)
6250
632899
10.
X
312188(-12.86%)
245033(-08.70%)
5339
562560
11.
XI
3749
15216
0
18965
12.
XII
3882
6657
0
10539
13.
మొత్తం(I-XII)
4151131
2903422
119576
7174129
14.
%
57.86
40.47
1.67
100.00







1.
తెలంగాణ రాష్ట్రం
I
352356
333237
26095
711688
2.
II
309425
299629
25575
634629
3.
III
309505
295000
25587
630092
4.
IV
308654
284959
24582
618195
5.
V
304065
285015
23274
612354
6.
VI
250345(-17.66%)
320874(+11.17%)
18571
589790
7.
VII
262035(+04.67%)
307753(-09.09%)
18494
588282
8.
VIII
265791(+01.50%)
277486(-09.83%)
16910
560187
9.
IX
267879(+01.43%)
247966(-10.64%)
14729
530574
10.
X
254137(-05.13%)
228759(-07.75%)
12391
495287
11.
XI
1361
14437
0
15798
12.
XII
2036
6360
0
8396
13.
మొత్తం(I-XII)
2887589
2901475
206208
5995272
14.
%
48.16
48.40
3.44
100.00

























*16-17 వయసులోని ఇంటరు విద్యార్థులు ఇందులో చేరలేదు; బ్రాకెట్లలోని +/- తో మొదలయ్యే సంఖ్యలు

                         ప్రతి ఏడాదీ  విద్యార్థుల సంఖ్యల   పెరుగుదల/తరుగుదలలో వచ్చిన మార్పులను తెలుపుతాయి.

2.3 ఆంగ్లమాధ్యమం అమలు-సమాజంలో సంక్షోభం:
ప్రతి  సంవత్సరం  శైశవస్థాయి పరిచయ తరగతి, ఆపైన 1 వ తరగతినుండి 12 వ తరగతివరకు చదివే పిల్లల సంఖ్య తెలుగు రాష్ట్రాలలో మొత్తం రెండుకోట్లు ఉంటుంది అన్నాం.  ఈ రెండు కోట్ల మంది 12 వ తరగతి పూర్తిచేసుకోడానికి 23 ఏండ్లు పడుతుంది. అంటే 23 ఏండ్లలో 2 కోట్లమంది ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రమే చదివినవారు తయారవుతారు. ఇక ఊహించండి ఏం జరుతుందో. పిల్లలు ఇంగ్లీషు మాధ్యమంలో చదువుతుంటే తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకోసం ఇంగ్లీషులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.  ప్రతి విషయంలోనూ అన్ని సందర్భాలలోనూ ఇంగ్లీషును వాడే ప్రయత్నం చేస్తారు. నానమ్మలూ అమ్మలూ, తాతయ్యలూ సొంత ఇంటిలోనే తెలుగు మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారేమోనని వెతుక్కోవాలి. లేదంటే బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కూర్చోవాలి. ఒక వేళ ఎవరైనా దొరికినా ఏ గోడ చాటుకో పోయి మాట్లాడుకునే కాలం దాపురిస్తుంది. ఇంగ్లీషు పుస్తకాలనే కొంటారు. తెలుగు పుస్తకాలు రాసేవాళ్లూ కొనేవాళ్లూ ఉండరు. ఇంగ్లీషు సినిమాలకే అలవాటు చేస్తారు.  తెలుగు సినిమాలు తీయరు. తీసినా ఆడవు. ఆడినా   ఇంగ్లీషు టైటిల్సుతోనో లేక డబ్బింగు చేసో ఆడించాలి. ఇంట్లో ఇంగ్లీషు టీవీచానెళ్లే నడుస్తాయి.   ఇంగ్లీషు వార్తా పత్రికలే అమ్ముడుబోతాయి. ఇంగ్లీషులో చెప్పగలిగినవారి ఉద్యోగ అవసరాలే తీరతాయి. మాళ్లూ, మార్కెట్లూ, హాళ్లూ,  హోటళ్లూ, షాపులూ అన్నింటా డబ్బు నీళ్లలా ఖర్చయ్యే  ప్రతి చోటా ప్రతివారూ మరొకరిని మెప్పించటానికి ఇంగ్లీషు వాడే ప్రయత్నం చేస్తారు. దీనితో ఊహించరాని  వేగంతో ఇంగ్లీషు వరద ముంచెత్తుతుంది. ఆయితే ఇదంతా   ఉన్నత, మధ్యతరగతి వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇది సమాజంలో అనేక ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. సమాజం పూర్తిగా ఇంగ్లీషును వాడేవారూ అసలు ఇంగ్లీషును వాడనివారు అని రెండు భాగాలుగా చీలిపోతుంది. ప్రభుత్వ బడులలో ఇంగ్లీషు మాధ్యమంలో చదివే బడుగు, బలహీన, కింది - మధ్యతరగతి వర్గాలకు ఇది పిడుగుపాటు లాంటిదే. కార్పొరేట్ స్కూళ్లలోనూ ప్రైవేటు బడులలోని ఇంగ్లీషు మాధ్యమంలో చదివే ఉన్నత మధ్య తరగతివారి పిల్లలతో పోటీ  పడలేక ప్రభుత్వబడులలోని ఆంగ్లమాధ్యమ విద్యార్థులు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి. బడుగు వర్గాల పిల్లల తల్లిదండ్రులు తలతాకట్టు పెట్టైనా తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపటానికి ప్రయత్నిస్తారు. మళ్లీ ప్రభుత్వ బడులకు విద్యార్థులు రావటంలేదని చెప్పి మూసేసే పరిస్థితి వస్తుంది. అంటే మెల్లగా విద్య ప్రైవేటు పరమై పోతుంది. ఉన్న ఉద్యోగాలు అన్నీ ప్రైవేటు పరమైపోతాయి. బడుగువర్గాలవారు విద్యలోనూ ఉద్యోగాలలోనూ అవకాశాలు తగ్గి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాలుకూడా అడుగంటుతాయి.  అప్పటికి స్థానికభాషల ఆధారంగా పనిచేసే పరిశ్రమలూ మూతపడతాయి. దీనితో సమాజం సంక్షోభంలో పడుతుంది.

2.4 ఆంగ్లమాధ్యమం ఎందుకు ఉండకూడదు?
ఇంగ్లీషు అత్యధిక ప్రజల మాతృభాష కాదు. ఇంగ్లీషు ఈ దేశంలో ఎక్కువమందికి తెలిసిన భాషకాదు.   2001 జనాభా గణాంకాల ప్రకారం ఇంగ్లీషు కేవలం 2.3 లక్షలమంది భారతీయులకు ప్రాథమిక భాషగా ఉంది. ఐతే, 8.6 కోట్ల మంది తమ ద్వితీయ భాషగానూ   మరో 3.9 కోట్ల మంది తమ మూడవ భాష గానూ జనాభాలెక్కల సేకరణలో చెప్పుకున్నారు. అంటే ఈ లెక్కన, భారతదేశంలో ఎంతోకొంత ఇంగ్లీషును వాడగలిగేవారి సంఖ్య మొత్తం 12.5 కోట్లు అంట. వీరిలో ఎంతమందికి వాడకానికి అవసరమైనంత ఇంగ్లీషు వచ్చో? దీనిని ఎవ్వరూ కొలిచి మదింపుచేసే ప్రయత్నం చేయలేదు. కొన్ని ఇంగ్లీషు పదాలు మాట్లాడగలిగినంత మాత్రాన ఆ భాష వచ్చినట్లగాదు. ఆ లెక్కన మన దేశంలోనూ మరికొన్ని దేశాలలోనూ అందరికీ సంస్కృతం వచ్చినట్లే. మన దేశంలో ఉన్నత విద్య అంటే గ్రాడ్యుయేషన్ ఆపైన చదువుకున్నవారి  సంఖ్య,   2011 జనాభా లెక్కల ప్రకారం  8.15% మంది మాత్రమే. వీరిలో 30% పైగా గ్రామీణ ప్రాంతాలవారే. అందులోనూ అరవై శాతంపైగా విజ్ఞానసాంకేతిక రంగాలుకాని  భారతీయ భాషా సాహిత్యాలూ సామాజిక శాస్త్రాలు చదివినవారే.    
ఇంగ్లీషు భాషలో నైపుణ్యం ఉన్నవారు అతి తక్కువమంది. నూటపాతిక కోట్లమందికి ఇంగ్లీషు నేర్పే సమయంగానీ వనరులుగానీ మనకు లేవు. ఒక భాషను నేర్చుకోవడం అంటే ఆ భాష వ్యాకరణాన్ని నేర్చుకుంటే చాలదు ఆ భాషకు సంబంధించిన ఎంతో కొంత సాంస్కృతిక వారసత్వాన్ని వంటబట్టించుకోవాలి. ఇక్కడే వచ్చింది చిక్కు.   ఈ పరిస్థితులలో నేర్చుకున్న భాషలో సృజనాత్మక విలువలున్న రచనలు చేయగలగడం  అసాధ్యం. భారతదేశంలో ఉన్న వందలాది విశ్వవిద్యాలయాలలోని వేలాదిమంది ప్రొఫెసర్లు దశాబ్దాలతరబడి  పనిచేస్తున్నా వీరిలో బహుతక్కువమంది మాత్రమే ఆంగ్లంలో టెక్స్టుబుక్కులు రాస్తున్నారు. కానీ, ఇంగ్లండు, అమెరికా సం.రా. లలోని జూనియర్ ప్రొఫెసర్లుకూడా అతి తేలికగా విరివిగా టెక్స్టుబుక్కులు రాయడానికి కారణం ఇంగ్లీషు వారి మాతృభాష కావటమే. వచ్చీరాని ఇంగ్లీషు మాధ్యమం ద్వారా నేర్చిన విద్యతోనూ   ఇంగ్లీషులో ప్రావీణ్యం లేకపోవడంతోనూ అడుగడుగునా  తత్తరపాటుతో ఆత్మవిశ్వాస లోపంతో అన్నింటా వెనకడుగువేయడం జరుగుతోంది.

అత్యంతవేగంతో అభివృద్ధి చెందుతున్న ఆధునిక సమాచారసాంకేతిక యుగంలో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధనతో రెండు దశాబ్దాలలో స్థానిక భాషల ఆధారంగా నడిచే దేశీయ పరిశ్రమలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, సృజనాత్మక రచనలూ, పుస్తక ప్రచురణలూ, ముద్రణ,  చిత్రపరిశ్రమ, టీవీ, తరతరాల వారసత్వ జ్ఞానసంపద ఆధారంగా నడిచే వృత్తి వ్యాపారాలూ  మొదలైనవి. ఈ పరిశ్రమలు అంతరించడంతోబాటు వాటి ఆధారంగా ఉపాధి పొందుతున్న లక్షలాది పనివారు వీధిన బడతారు. భారతదేశ జనాభాలో 68% గ్రామీణులే. వీరిలో అధిక శాతం ఇప్పటికీ సాంప్రదాయ వృత్తులు చేసుకొనేవారే. ఇవే వారి జీవికకు ప్రధాన ఆధారం. ఇంగ్లీషు విద్యతో ఇవి అర్థరహితం ఔతాయి. ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్నవారితో మన సమాజంలో కొత్త అంతరాలు మొలకెత్తి  మన ఉనికికి స్పందించని కొత్త పోకడలున్న తరం తయారౌతుంది.

3.0  బోధనా మాధ్యమాల స్థితి-గతి:
 మన దేశంలో ఉన్న మొత్తం గ్రాడ్యుయేట్ల (పోస్టుగ్రాడ్యుయేట్లూ, ఇంజనీర్లూ, డాక్టర్లూ, డాక్టరేట్లూ) సంఖ్య పదమూడు కోట్ల అరవై అయిదు లక్షలకు పైనే (13,65,77,942) ఉంది. తెలుగు రాష్ట్రాలలో అయితే,  గ్రాడ్యుయేట్లు కోటీ పదకొండు లక్షలకు పైగానే (1,11,54,774) ఉన్నారు;  మన గ్రాడ్యుయేట్లలో 60% ఆర్ట్సూ సామాజికశాస్త్రాలకు చెందినవారే.       తెలుగు రాష్ట్రాలలో (2011) 5-17 సంవత్సరాల వయస్సువారి జనాభా రెండు కోట్లకు పైగానే (2,02,00,638) ఉండగా, 18-23  సం. వయస్సువారి  జనాభా తొంభై లక్షలకు పైనే (90,28,047) ఉంది; రెంటినీ కలుపుకుంటే ఏడాదికి    మూడు కోట్లమంది విద్యార్థుల వరకూ   ఏదో ఒక చోట చదువుకుంటూ   ఉంటారు.  ఐతే, తెలుగు రాష్ట్రాలలో పాఠశాల విద్యలోనూ జూనియర్ కాలేజీ విద్యలోనూ రెండు కోట్లమంది వరకూ ఉంటే ఉన్నత విద్యలో మిగిలిన కోటిమందీ ఉంటారు. షుమారుగా   గ్రాడ్యుయేటు స్థాయిలో అత్యధికంగా  అంటే 34% శాతం ఆర్ట్సులోనూ ఆపైన ఇంజనీరింగూ టెక్నాలజీలో  19%, కామర్సులో 14.5% , సైన్సులో 12%, మిగిలిన పది శాతం ఇతర విషయాలలోనూ చేరుతున్నారు. భారతదేశంలో మొత్తం 17 లక్షల 40 వేల 614 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 10 లక్షల 31 వేల 361 స్కూళ్లు ప్రాథమిక పాఠశాలలే.  ఐతే 4,72,350 ప్రాథమికోన్నత పాఠశాలలూ 1,74,240 మాధ్యమిక పాఠశాలలూ, 62,663 మాత్రమే ఉన్నత పాఠశాలలు ఉన్నాయి (8వ అభాపావిస, 2015). 8వ సర్వే ప్రకారం పాఠశాల విద్యలో 86.62% శాతం మాత్రమే మాతృభాషలో బోధన జరుగుతోంది. ఇది 7వ సర్వే నుంచి 5.55 శాతం తరుగుదల. పట్టణప్రాంతాలలో మాతృభాషలో బోధన ఇంకా తగ్గి 81 శాతానికి పడిపోయింది (7వ సర్వే లో 90  శాతం పైనే).

పట్టిక-2 భారతదేశంలో మాతృభాషామాధ్యమంలో ప్రాథమిక విద్యాబోధన
క్ర.సం.
*అభాపావిస.
మొత్తం
పట్టణప్రాంతం
గ్రామీణప్రాంతం
1.
8 (2009)
86.62%
80.99%
87.56%
2.
7 (2002)
92.07%
92.39%
90.39%
3.
6 (1997)
91.65%
91.32%
91.70%






*అభాపావిస= అఖిలభారత పాఠశాల విద్య సర్వేక్షణ

ఇంగ్లీషుమాధ్యమంలో పాఠశాల విద్యాబోధన 1997 లో ప్రాథమిక విద్యాబోధనలో 5శాతం ఉండగా  2002కి అది 13శాతం అయి 2009కి 15.50 శాతానికి చేరింది. ఇంగ్లీషుమాధ్యమంలో ఉన్నతపాఠశాల విద్యాబోధన 33 శాతానికి చేరుకోవడం ఏమంత సంతోషించదగ్గ విషయం కాదు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఇంగ్లీషుమాధ్యమంలో పాఠశాల స్థాయిలో విద్యాబోధన అంచెలంచెలుగా పెరగడం సరిగ్గా ప్రాథమిక స్థాయినుండి  ఉన్నత పాఠశాల స్థాయివరకూ  బడిమానేసే విద్యార్థుల పెరుగుదలతో సమాంతర నిష్పత్తిలో ఉండటం ఆలోచించవలసిన విషయం.

                                     
పట్టిక-3 భారతదేశంలో ఇంగ్లీషుమాధ్యమంలో పాఠశాల విద్యాబోధన
క్ర.సం.
అభాపావిస.
ప్రాథమికస్థాయి
ప్రాథమికోన్నతస్థాయి
మాధ్యమికస్థాయి
ఉన్నతస్థాయి
1.
8 (2009)
15.49%
21.08%
28.73%
33.06%
2.
7 (2002)
12.98%
18.25%
25.84%
33.59%
3.
6 (1997)
4.99%
15.91%
18.37%
28.09%

ప్రజాప్రభుత్వాలు ప్రజల భాషలో పరిపాలన, విద్యాబోధన చేయవలసివున్నా ఎలాంటి శాస్త్రీయ సైద్ధాంతిక ఆధారాలు లేకుండా ఇంగ్లీషు మాధ్యమాన్ని అమలు జేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? దీనివలన భవిష్యత్తులో దేశ ఆర్థికవ్యవస్థ ఎంత ఛిన్నాభిన్నమైపోతుందో ఆలోచించే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు. తేట తెలుగనీతీయనిదనీ, అమ్మనుడి అనీ, అధిక సంఖ్యాక ప్రజల భాష అనీ, వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి గలదనీ చెబితే వినే రోజులు కావు ఇవి. వాస్తవాలను మరుగుపరిచి,  ఇంగ్లీషు నేర్చితేనే ఉపాధి ఉద్యోగావకాశాలు వస్తాయని భ్రమలు కల్పించి ఆంగ్ల మాధ్యమం వైపు చూసేవారికి, ఒక శాస్త్రీయమైన ఆలోచనా విధానంలో తెలుగూ తదితర  దేశ భాషల శక్తి సామర్థ్యాలను-ఆర్థిక కోణంనుండి చూపించాల్సిన అవసరం ఉంది.

ఆధునికత, అభివృద్ధీ, ఉద్యోగాల పేరుతో ఇంగ్లీషు మాధ్యమాన్ని తవ్వి తలకెత్తుకుంటున్నాం. ఊహాజనిత ప్రకటనలూ కథనాలద్వారా యువతకు ఇంగ్లీషు మాధ్యమంపై విపరీతమైన ఆశలను కల్పిస్తున్నాం. ఇంగ్లీషుకు లేనిపోని  గొప్పతనాన్ని అంటగడుతున్నాం. మంచి విద్యావిధానం అంటే ఇంగ్లీషు చదువేనన్నట్లుగా వ్యాఖ్యానించటం అలవాటయింది.  తెలుగుమాధ్యమ విద్యను అన్ని విధాలా ఆగమాగంచేసి ప్రభుత్వ బడుల్లో నుంచి కూడా తరిమేస్తున్నాం.  ఇంగ్లీషు పేరుతో విద్యను వ్యాపారంగా మలిచి సమాజంలో కింది వర్గాలవారికి అందరాని మానిపండుగా చేశాం. ఇంగ్లీషు మాధ్యమంలో నేర్చితేనే  ఉద్యోగావకాశాలు వస్తాయనీ, అధిక సంపాదనకు ఆస్కారం ఉంటుందనే భ్రమను కల్పిస్తున్నాం. విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ ఆ భాషపై  మోజు పెరగడానికి ఇదే కారణం.  ఈ కథనాల జాబితాలో ఎంత నిజం ఉందో, చెప్పేవాళ్లల్లో ఎంత నిజాయతీ ఉందో ఎప్పుడన్నా ఎవరన్నా శాస్త్రీయ దృక్పథంతో   విశ్లేషించి చూశారా?  భారతీయ ఆర్థిక  వ్యవస్థకు ఇంగ్లీషూ తదితర భారతీయ భాషల   ఆర్థిక సామర్ధ్యాన్నీ వాటిద్వారా సమాజానికి ఉద్యోగాల రూపంలో కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలనూ మనం ఒక్కసారి బేరీజు వేసి చూసుకోవాలి.  మాతృభాష  వాడకం  మన జన్మ హక్కు. మాతృభాష  ఆర్థిక స్వావలంబనకు ఆధారం. ఈ స్థానాన్ని మరొక భాష ఆక్రమణకు అవకాశం కల్పించడం   మన హక్కులను కాలరాయడమే ఔతుంది. భాషా హక్కులను గుర్తించి వాటిని పరిరక్షించే బాధ్యత ప్రజా ప్రభుత్వాలదే. అట్లా జరగనప్పుడు జనభాషలు న్యాయం చేయండి అంటూ జనతా గ్యారేజీ ముందుకు రాకతప్పదు.

  అదే ఇప్పుడు తెలుగు భాష లేక జననుడికి వచ్చిన సమస్య. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైనది కొన్ని విషయాల వివరాలూ వాటిపట్ల అవగాహన. ఈ అవగాహనను తెలుగు మాట్లాడే వాళ్లందరికీ కల్పించాలి. ఈ అవగాహనకోసం   కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి.  
1.         వాణిజ్య వ్యాపార రంగాలలో స్థానిక భాషల వాడకం ఎంత?
2.            స్థూల జాతీయోత్పత్తిలో మాతృభాషల భాగస్వామ్యం ఏమిటి?
3.           వివిధ రాష్ట్రాలలో  స్థూల రాష్ట్ర ఉత్పత్తులలో మాతృభాషల భాగస్వామ్యం ఏమిటి?

4.           ఉద్యోగ ఉపాధి రంగాలలో భారతీయభాషల భాగస్వామ్యం ఎంతెంత?
5.   ప్రాథమిక స్థాయినుండి ఉన్నత విద్యాస్థాయి వరకూ ఏ స్థాయిలలో భారతీయ భాషల వాడకం ఎంతెంత?
ఈ పై ప్రశ్నలకు రాబట్టిన  సమాధానాలే మన మాతృభాష పట్ల సమాజంలో దాని స్థానంపట్ల మన అవగాహనను ఒక శాస్త్రీయ పద్ధతిలో తర్కబద్ధంగా ఆలోచింపజేస్తుంది.

 4.0   విరుద్ధ వాదనలూ ప్రతికూల ఆధారాలూ:
       
2011 జనాభా లెక్కల ప్రకారం నాటి ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా 8 కోట్ల 45 లక్షల 8 వేల 777  మంది (ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో : 4, 93, 86,799; నేటి తెలంగాణలో: 3, 52, 86,757).  వైశాల్యంలో    2,75,045 . కిమీలేక   1,06,195  చదరపు మైళ్ళు (ఇప్పటి ఆంధ్రప్రదేశ్: 160,205 . కిమీ., 61,855 .మై.; నేటి తెలంగాణ:  114,840 . కిమీ., 44,340 .మై.). జనాభా సాంద్రతలో చదరపు కిలోమీటరుకు 308 మంది లేదా చదరపు మైలుకు 796 మందితో (ఇప్పటి ఆంధ్రప్రదేశ్: . కిమీ.కి 308, . మై.కి 800; నేటి తెలంగాణా: .కిమీ.కి 307, .మై.కి 800).  సగటు భారతదేశ జనసాంద్రతకంటే తక్కువే. తెలుగు రాష్ట్రాల జనాభాలో షుమారు 11 శాతం 6 ఏండ్ల లోపువారే. 67 శాతం అక్షరాస్యులతో దేశంలో అట్టడుగు స్థానం మనది.  ఆంధ్ర ప్రదేశ్ (తెలుగు రాష్ట్రాల)లో చదువుకున్నవారూ చదువులేనివారూ, చిన్నా పెద్దా ఉద్యోగస్తులు అనే తేడాలేకుండా (అధ్యాపకులూ, లాయర్లూ, డాక్టర్లూ, ఇంజనీర్లూ, వ్యాపారస్తులూ అందరినీ, ఇంటిపనీ బైటిపనీ అన్నీ కలుపుకొని) కార్మిక శ్రామిక శక్తి మొత్తం సంఖ్య 3,48,93,859 మంది.   ఇది మొత్తం భారత దేశంలో పనిచేసే జనాభాలో 8.67%. వీరిలో  అక్షరాస్యులు  1 కోటీ 50 లక్షలమంది  అంటే 42.85%. ఐతే కొద్దోగొప్పో ఇంగ్లీషు వాడగలిగినవాళ్లు (గ్రాడ్యుయేట్లూ పోస్టుగ్రాడ్యుయేట్లూ) 16 లక్షల 86 వేల104 మంది అంటే 4.85% మాత్రమే.  తెలుగు రాష్ట్రాలలోని మొత్తం పనివారిలో 80.74 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందగా 19.26 శాతం మాత్రమే పట్టణ ప్రాంతాలవారు. స్థూల జాతీయ ఉత్పత్తికి తోడ్పాటునందించే పనివారిలో  34.33 శాతం గ్రాడ్యుయేట్లు గ్రామీణ ప్రాంతంనుండే. భారతదేశంలో ప్రతి ఏటా 15 లక్షలమంది ఇంజనీర్లు తయారవుతున్నారు. ఐతే వారిలో 20% మాత్రమే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు.  భారతదేశంలో 2011-12 సంవత్సరంలో మొత్తం నిరుద్యోగులలో 30 శాతం మంది గ్రాడ్యుయేట్లే ఉన్నారు. భారతదేశంలో పనివారిలో నిరుద్యోగ రేటు 9.4 శాతం  కాగా, యువతలో ఇది 20% గా అంచనా. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో షుమారు  80% మంది నిరుద్యోగులే. భారతదేశపు 2013 జాతీయ ఉపాధి నివేదికలో ఇంజనీర్లలో 21% మాత్రమే వాస్తవానికి ఉద్యోగాలు పొందినవారు. భారతదేశంలో యూనివర్సిటీ విద్యార్థులలో 16% మాత్రమే    సాంకేతిక విద్యను అభ్యసించినవారు. ఆంగ్లం-మాట్లాడే జనాభా పెద్దగా ఉందనుకుంటున్న భారతదేశంవ్యాపార వాణిజ్యసేవలతోపాటు సమాచార సాంకేతిక సేవలకూ,  సాఫ్ట్వేర్ కార్మికులకూ ప్రధాన ఎగుమతిదారు.   ఆయితే ఈ సేవలకు ఇంగ్లీషు మాట్లాడే దేశాలకంటే ఇంగ్లీషేతర దేశాలే ప్రధాన ఆధారం.

స్థూలజాతీయోత్పత్తి ఆధారంగా (2011-12) దేశంలో నాల్గవ  అభివృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.   రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలూ సేవా రంగాల ద్వారా జరుగుతుంటుంది. రాష్ట్ర  ఆర్ధిక వ్యవస్థలో ఆహార ప్రాసెసింగ్, సాఫ్ట్వేర్ ఎగుమతులు, ఆర్థిక సేవలూ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్తు, వస్త్రాలూ పర్యాటక రంగాలు ప్రధానమైనవి.       ప్రస్తుతం స్తూలరాష్ట్రజాతీయోత్పత్తి 464, 184 కోట్లు. వ్యవసాయాధారిత ఉత్పత్తులద్వారా 87,096 కోట్లూ (19.04%), పరిశ్రమలు గనుల తవ్వకంద్వారా 1,08,000 కోట్ల రూపాయలు (23.61%), సేవారంగంద్వారా  2,62,256 కోట్ల రూపాయల (57.34%) సంపదను మన పనివారు సృష్టిస్తున్నారు.  సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవున్న తీరప్రాంతంతో భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తులలో ఆంధ్ర ప్రదేశ్ భాగస్వామ్యం 22 శాతంపైగానే (7500 కోట్లు), స్థూలజాతీయోత్పత్తి దేశ ఆర్ధిక వ్యవస్థకు అద్దంపడుతుంది. మొత్తం స్తూలజాతీయోత్పత్తికి వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనేవి మూడు ప్రధాన అంగాలు.   వ్యవసాయ అనుబంధ ఆర్థిక వనరులకింద   పాడిపంటలూ, చేపలపెంపకం, అడవులూ, గనుల తవ్వకం మొదలైనవాటినుంచి వచ్చే రాబడి కాగా పరిశ్రమలకింద  వస్తువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి,   నిర్మాణాలు మొదలైనవి ఉంటే,   సేవలకింద ప్రభుత్వ కార్యకలాపాలు, సమాచార, రవాణా, ఆర్థిక, ఇంకా వస్తూత్పత్తి లేని ఇతర  ఆర్థికవనరులకుసంబంధించిన కార్యకలాపాలు  ఉంటాయి.

జాతీయ నమూనా అధ్యయన కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) 2011-12లో నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో మొత్తం శ్రామిక శక్తి (అన్ని వర్గాల ఉద్యోగస్థులను కలుపుకొని) 47.41 కోట్లు.  ఐతే,  వీరిలో 40 కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు.  ఇది ప్రపంచంలోనే 2వ స్థానం. వృత్తి పరంగా చూస్తే, వీరిలో 49% వ్యవసాయంలో, 20% పరిశ్రమలలో, 31% సేవారంగంలో ఉన్నారు. భారతదేశంలో గ్రామీణ జనాభా 68.84%. వ్యవసాయాధారిత స్థూల జాతీయ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం మనది. 2014 సిఐఏ ఫాక్టుబుక్ ప్రకారం, భారత దేశపు వ్యవసాయ రంగంలో స్థూల జాతీయ ఉత్పత్తుల విలువ   25 లక్షల కోట్ల రూపాయిల పైనే. ఇది మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో సుమారు 18 శాతం.  పరిశ్రమల రంగంలో స్థూల జాతీయ ఉత్పత్తుల విలువ   33 లక్షల కోట్ల రూపాయిలు అంటే స్థూల జాతీయోత్పత్తిలో 31 శాతం పైనే.  ఇక సేవారంగంలో స్థూల జాతీయ ఉత్పత్తుల విలువ 79.46 లక్షల కోట్ల రూపాయిలు ఇది స్థూల జాతీయోత్పత్తిలో 51 శాతం.

4.1  అక్షరాస్యత-భాష-స్థూలజాతీయఉత్పత్తి: 2011 జనాభా లెక్కల ప్రకారం, 125 కోట్ల మంది ఉన్న మన దేశంలో అక్షరాస్యుల సంఖ్య 56.1 కోట్లు. వీరిలో 52% 'ప్రాథమిక' స్థాయి దాటనివారే.   అట్లాగే, 30.20%మంది సెకండరీ స్థాయిని మించనివారు. ఇక మొత్తం అక్షరాస్యులలో 4 కోట్లమంది మాత్రమే పట్టభద్రులు. అంటే, భారతదేశం మొత్తం జనాభాలో వీరు 6.59%  శాతం మాత్రమే.  సాంప్రదాయికత మేళవించిన ఆధునిక వ్యవసాయం, హస్తకళలూ, విస్తృత ఆధునిక పరిశ్రమలూ పలు రకాల సేవలూ కలిగిన వైవిధ్య భరితమైన భారతదేశ   ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే బహు అరుదు. మన శ్రామిక వర్గంలో సగం  వ్యవసాయంలోనే ఉంది. ఐతే మన ఆర్థికాభివృద్ధికి వ్యవసాయేతర సేవలు ప్రధాన కారణమవుతున్నాయి. మన శ్రామికశక్తిలో   ఒక వంతు   ఉద్యోగులతో భారతదేశపు స్థూలజాతీయ ఉత్పత్తిలో దాదాపు నాల్గింట రెండు వంతులవరకూ సేవారంగంద్వారా సమకూడుతోంది. శ్రామిక శక్తిలో మిగిలిన ఒక వంతు వివిధ పరిశ్రమలలో వస్తూత్పత్తిలోనూ గనులతవ్వకంలోనూ ఉంటూ స్థూలజాతీయ ఉత్పత్తికి నాలిగింట ఒక భాగాన్ని అందిస్తున్నారు.  


ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలలో 'మూడు విభాగాల సిద్ధాంతం' అని ఒకటి ఉంది. అది ఆర్థిక వ్యవస్థను మూడు విభాగాలుగా విభజిస్తుంది, మొదటిది ప్రాకృతిక వనరులనుండి ముడి పదార్థాల వెలికితీతరెండవది ముడిపదార్థాలనుండి ఉత్పత్తుల తయారీమూడవది  సేవలు:
ఆర్ధిక వ్యవస్థకు మొదటి రంగంలో జీవనాధారమైన వ్యవసాయం, పాడి ఇతర  ఆహార ఉత్పత్తులూ.  అటవీ వనరులు,   వేట, మేత,  ఆహార సేకరణ, చేపలపెంపకం,  గనులతవ్వకం మొదలైనవి   ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ రెండవ  రంగంలో  వస్తూత్పత్తి   ప్రధానం. వస్తువుల తయారీ, ఉత్పాదనా ప్రక్రియలతో  నిర్మాణాలూ, లోహాలనుంచి వస్తు వాహనాల తయారీ, వస్త్ర ఉత్పత్తి, రసాయన, ఇంజనీరింగ్ పరిశ్రమలలో వస్తువుల తయారీ, విద్యుత్తు తయారీ దానీ వినియోగాలు,  మద్యపానీయాల తయారీ, నౌకానిర్మాణం, భవన నిర్మాణాలూ  మొదలైనవి ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ తృతీయ రంగం సేవా పరిశ్రమగా గుర్తించవచ్చు. ఈ రంగం సాధారణ జనాభాకూ భిన్న వ్యాపారాలకు కావాల్సిన  సేవలను అందిస్తుంది. ఈ రంగంలో కార్యకలాపాలు చిల్లర,   టోకు అమ్మకాలు, ముద్రణా, రవాణా, పంపిణీ ఇంకా వినోదం (చలనచిత్రాలు, టెలివిజన్, రేడియో, సంగీతం, సినిమాహాళ్లు మొదలైనవి), గుమస్తా సేవలు, ప్రసారమాధ్యమాలూ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పర్యాటకం, రెస్టారెంట్లూ హోటళ్లూ, ఆరోగ్యం-సంరక్షణ, విద్య ఇంకా న్యాయసంబంధ లావాదేవీలు ఉంటాయి. అభివృద్ధిచెందుతున్న దేశాలలో ఉద్యోగావకాశాలు పెరుగుదలకు ఈ రంగమే ప్రధాన ఆకర్షణ.
          మన చుట్టూతా ఉన్న ఆర్థిక వనరుల ఆధారంగా శ్రమ శక్తితో సంపదను సృష్టిస్తాం. సంపద సృష్టికి మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక జ్ఞానం ఎంతో కొంత అవసరం అవుతుంది.  సంపదను సృష్టించే ప్రతి పనిలోనూ శ్రమే ప్రధాన సాధనం.   ఈ శ్రమకు ఆధారం  జ్ఞానం. ఆ జ్ఞానం మనకు అనుభవంద్వారా వస్తుంది. ఈ అనుభవం ఇంటా బైటా, చదువుతోనూ చదువులేకుండానూ సంపాదించవచ్చు. సాంప్రదాయకంగానూ వారసత్వంగానూ వచ్చిన జ్ఞానానికి చదువు తోడైతే వచ్చే జ్ఞానంతో  తక్కువకాలంలో ఎక్కువ సంపదను సులువుగా సృష్టించే వీలు కలుగుతుంది.  ఈ చదువుకి  భాష ఆధారం. అంటే  భాషతో జ్ఞానార్జన జరుగుతుంది.  ఈ భాష మన మాతృభాష అయితే జ్ఞానార్జన సులువు అవుతుంది. ఇది మళ్లీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. దీనితో తరగతి గది సహజంగా అనిపిస్తుంది.  మన రాష్ట్రంలో  పనిచేస్తున్నవారు    ఏయే భాషలు వాడుతూ సంపద సృష్టిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ కింద చూపిన పట్టిక చూస్తే తెలుస్తుంది. ఈ పట్టికలో ఇచ్చిన ఆర్థిక వనరులూ (నిలువుగడి-2), సంఖ్యలూ (3-10 నిలువగడులలో) 2001-2011 సంవత్సరాల జనాభా గణాంకాలనుండి తీసుకున్నవి. ఈ పట్టికలో మన తెలుగు రాష్ట్రాలలో  స్థూల  రాష్ట్ర ఉత్పత్తీ, దాన్ని సృష్టించిన పనివారూ (వ్యవస్థిత అవ్యవస్థిత రంగాలలోనూ), ఆ పనివారల చదువుల స్థాయికి సంబంధించిన గణాంకాలూ ఉన్నాయి. వీటి ఆధారంగా ఎవరెవరు ఎంతెంత  సంపదను సృష్టించారో తేలికగా కనుక్కోవచ్చు. మొత్తం పనివారిలో నిరక్షరాస్యులు 32.50 శాతం. గ్రాడ్యుయేషనూ అంతకంటే ఎక్కువచదివిన పనివారి శాతం 15.48 మాత్రమే. వివిధ ఆర్థిక వనరుల కార్యకలాపాలలో పాల్గొన్న గ్రాడ్యుయేట్లైనవారి సంఖ్యలూ శాతాలు  8వ నిలువగడిలో కనిపిస్తాయి. గ్రాడ్యుయేట్ అయిన పనివారు తాము చేసేపనిలో ఎంతో కొంత ఇంగ్లీషును వాడివుంటారు. అంటే 15.48శాతం మంది తాము చేసేపని ఇంగ్లీషు   వాడి చేసివుంటారని అనుకుందాం. ఇక, తెలుగు రాష్ట్రాల ఆదాయానికి షుమారు లక్షన్నర కోట్లు సంపాదించిపెట్టే వ్యవసాయ అనుబంధ ఆర్థిక వనరులలో నేలను చదును చేసి, దుక్కి దున్ని, నీరు పెట్టి, నారు పోసి, నాట్లు వేసి, కలుపు తీసి, ఎరువు వేసి, మందు చల్లి,  పంట కోసి మార్కెట్లకు తరలించే పనిచేసే పనివాళ్లు తెలుగునో మరో మాతృభాషనో వాడతారు కానీ ఇంగ్లీషు కాదు. ఈ రంగంలో గ్రాడ్యుయేట్లైనవారుకూడా మాతృభాషలను వాడతారేగానీ ఇంగ్లీషును వాడరు. ట్రాక్టరుతో దున్నినా, రసాయనిక మందులు వేసినా, ఆధునిక ఎరువులు వేసినా అన్నీ మాతృభాషలను వాడుతూనే గానీ  ఇంగ్లీషుని వాడుతూ పనిచేయరు. ట్రాక్టరుతో దున్నడానికి ఇంగ్లీషు అవసరంలేదు. ఈ పనిలో ఇంగ్లీషునుంచి అరువు తెచ్చుకున్న కొన్ని పదాలు వాడినంతమాత్రాన ఇంగ్లీషు వచ్చు అని కాదు.   అయితే, ట్రాక్టరు తయారీలో ఇంగ్లీషు వాడలేదా అంటే వాడివుండవచ్చు కానీ అది తయారీ మరమ్మతుల కింద వస్తుంది. అక్కడ దాని తయారీలో పాలుపంచుకున్న ఇంజనీర్లూ సైంటిస్టులూ 5.43 శాతంమంది(3వ వరుస) ఇంగ్లీషు వాడినవారిలో భాగమే. అట్లాంటిదే రసాయనికి మందులూ ఎరువుల వాడకం. వాటిని వాడటానికి ఇంగ్లీషు అవసరం లేదు. కానీ వాటి తయారీలో కొంతమేరకు ఇంగ్లీషు వాడివుంటారు. ఆ లెక్క 3 వ వరుసలోకి వస్తుంది. 

 పట్టిక-4 తెలుగురాష్ట్రాలలో ఆర్థిక వనరుల  కార్యకలాపాలు - వాడుక భాషలూ వాటి భాగస్వామ్యం

క్ర.
సం.
ఆర్థిక వనరులూ కార్య కలాపాలు
వివిధ రంగాలవారీ స్థూరాఉ
రంగాలవారీగా పనివారు
చదువుకోని
 పనివారు

 ప్రాథమిక విద్యచదివిన  
పనివారు
మాధ్యమిక
విద్యచదివిన  
పనివారు
గ్రాడ్యు
యేట్లైన
పనివారు

ఆర్థికకార్య
కలాపాల
వాడుకభాష
మాతృభాష
ఇంగ్లీషు
1
2
3
4
5
6
7
8
9 (5-7)
10 (8)
1.
వ్యవసాయ అను.
1,46,926
26.07%
632,750
3,81,860
60.35%
180,560
42,060
28,270
4.47%
95.53
4.47
2.
గనులూ
తవ్వకాలు
11,704
2.08%
286,030
1,72,380
60.26%
64,680
33,440
15,530
4.30%
95.70
4.30
3.
తయారీ మరమ్మతులు
1,60,246
 28.44%
16,38,810
8,05,490
49.15%
583,850
179,070
70,400
5.43%
94.57
5.43
4.
విద్యుత్,గ్యాస్
నీటి పంపిణీ
1,01,420
9,290
9.16%
25,940
46,430
19,760
19.48%
80.52
19.48
5.
నిర్మాణ
రంగం





2,44,633
43.41%
10,95,380
5,14,760
46.99%
378,030
141,920
60,670
15.77%
85.33
15.77
6.
టోకు వ్యాపారం,
చిల్లర వర్తకం
24,04,700
5,74,440
23.89%
828,740
731,950
269,570
11.21%
88.79
11.21
7.
హోటళ్లు  రెస్టారెంట్లు
2,32,440
76,110
32.74%
94,580
44,400
17,350
07.46%
92.54
07.46
8.
రవాణా,
నిల్వలూ సమాచారప్రసారాలు
11,18,350
2,35,830
21.09%
402,910
355,840
123,770
11.07%
88.93
11.07
9.
ఆర్థికవాణిజ్య, వ్యాపారాలు ....
5,06,250
29,800
5.89%
63,750
165,420
247,280
49.85%
51.15
49.85
10.
ప్రభుత్వ పాలన,
న్యాయ,రక్షణ,
విద్య, వైద్య ...
27,61,820
7,03,080
25.46%
510,540
732,920
815,280
29.52%
70.48
29.52

మొత్తం అంకెలలో
5,63,509
1,07,77,950
35,03,040
31,33,580
24,73,450
16,67,880
15.48%
84.52
15.48

మొత్తం శాతం
100%
100%
32.50%
29.07%
22.95%
15.48%
84.52
15.48




84.52%       +         05.16 (1/3) =
89.67%
10.33%

      

ఆర్థిక కార్యాచరణ ద్వారా   (2004-05 స్థిరాంక ధరలలో) *స్తూలరాష్ట్రఉత్పత్తి= స్థూరాఉ. ముందస్తు అంచనాలు కోట్ల రూ.లలో (2011).  వ్యవసాయ అను.= వ్యవసాయం, పశుపాలన, చేపల పెంపకం;  

తెలుగురాష్ట్రాలలో ఉన్న మొత్తం 1 కోటీ 7 లక్షల 77 వేల 950 మంది  ఉద్యోగులలో 32.50 శాతం  మంది నిరక్షరాస్యులే. ఇక మిగిలిన 67.50 శాతం అక్షరాస్యులలో 15.48 శాతం మాత్రమే గ్రాడ్యుయేటూ ఆ పైన చదువుకున్నవారు.  అంటే  నిరక్షరాస్యులనూ గ్రాడ్యుయేట్లుకాని అక్షరాస్యులనూ(52.02%)   కలుపుకుంటే మొత్తం 84.52 శాతం ఉద్యోగులు మాతృభాషను మాత్రమే వాడగలిగినవారు. వీరిలో మెట్రిక్ చదివిన 22.95 శాతం మందికి  మాత్రమే కొద్దోగొప్పో ఇంగ్లీషు భాషతో పరిచయం ఉంది. ఇక స్థూలరాష్ట్ర ఉత్పత్తికి తోడ్పడుతున్న ఉద్యోగులలో గ్రాడ్యుయేట్లను(15.48%)  మాత్రమే కొంతవరకూ ఇంగ్లీషు వాడగలిగినవారిగా గుర్తించవచ్చు. ఐతే, వ్యవసాయ అనుబంధ శాఖలలోనూ, తయారీ మరమ్మత్తులలోనూ, నిర్మాణరంగంలోనూ, హోటళ్లు రెస్టారెంట్లలోనూ,  టోకు వ్యాపారం, చిల్లర వర్తకం, ఇంకా  రవాణా, నిల్వలూ సమాచార ప్రసారాలు  మొదలైనరంగాలలో గ్రాడ్యుయేట్లైన పనివారు కూడా  తెలుగే వాడతారని  అనుకోవడం సమంజసమే.  ఎంతలేదనుకున్నా గ్రాడ్యుయేట్ పనివారలలో మూడింటి ఒక వంతు (15.48%/3 = 5.16%) తెలుగే (మాతృభాష) వాడతారనుకుంటే, తెలుగురాష్ట్రాల స్థూలరాష్ట్ర ఉత్పత్తి షుమారు 90 (=84.52+5.16%) శాతం తెలుగుభాష వాడుక ద్వారానే సమకూరుతోందని అని ఈ పట్టిక నిరూపిస్తోంది. 

ఇక కింద చూపిన పట్టిక, భారతదేశంలో  వివిధ ఆర్థిక కార్యకలాపాలలో పాలుపంచుకొని మాతృభాషలూ ఇంగ్లీషూ ఎంతెంత వాడి  ౪౮ లక్షల ౭౯ వేల కోట్ల విలువ (2010-11 మార్కెట్ ధరలలో దీని విలువ 78 లక్షల 77 వేల 947 కోట్లు) చేసే దేశ స్థూలజాతీయోత్పత్తి సృష్టికి కారణమయ్యారో తెలుపుతోంది. 2010-11 స్థూల జాతీయోత్పత్తి సాధనలో పాల్గొన్న మొత్తం పనివారలలో గ్రాడ్యుయేట్లైన పనివారు 14.83 శాతం కాగా నిరక్షరాస్యుల మొత్తం 25.50 శాతం. ఇక మిగిలినవారు  (ప్రాథమిక విద్య, సెకండరీవిద్యా స్థాయి వారు 59.63 శాతం. గ్రాడ్యుయేట్లు కాక మిగిలినవారు మొత్తం 85.13 శాతం.  స్థూల జాతీయోత్పత్తిలో వీరి మొత్తం తోడ్పాటు 82.73 శాతం. అంటే స్థూల జాతీయోత్పత్తిలో 17.26 శాతం మాత్రమే ఇంగ్లీషు ద్వారా సమకూరుతోంది.



పట్టిక-5 భారతదేశంలో ఆర్థిక వనరుల  కార్యకలాపాలూ పనివారూ వాడుక భాషల (2011), కోట్లలో;

స్థూల జాతీయోత్పత్తి సృష్టిలో  భాషల భాగస్వామ్యం
క్ర. సం.

ఆర్థిక వనరులూ
 కార్యకలాపాలు
రంగాలవారీ
 అం.లలో

రంగాలవారీ  శాతం
గ్రాడ్యుయేట్లైన
పనివారి%
గ్రాడ్యుయేట్లైన
పనివారి
తోడ్పాటు%
గ్రాడ్యుయేట్లుకాని
పనివారు%
గ్రాడ్యుయేట్లుకాని
పనివారి
తోడ్పాటు%
అక్షరాస్యుల
మొత్తం %
నిరక్షరాస్యుల
మొత్తం %
నిరక్షరాస్యుల తోడ్పాటు%
గ్రాడ్యుయేట్లు 
 కాని పనివారి
తోడ్పాటు%
ఆర్థికవనరుల కార్యకలాపాల వాడుకభాష%
మా.భా / ఇం.

1
2
3
4
5
6
7
8(4+6)
9
10
11(7+10)
12 (11 / 5)
1.
వ్యవసాయ అనుబంధాలు
6,92,499
14.19
04.63
0.65
47.61
6.76
52.24
47.76
6.78
13.54
13.54 / 0.65
3.
తయారీ- మరమ్మతులు
7,76,337
15.91
05.37
0.85
51.54
8.20
56.92
43.10
6.86
15.06
15.06 / 0.85
5.
నిర్మాణ
రంగం
3,84,282
07.90
05.45
0.43
58.18
4.60
63.63
36.37
2.87
07.47
07.45 / 0.43
2.
గనులూ
తవ్వకాలు
1,10,482
02.26
07.61
0.17
48.51
1.10
56.12
43.88
0.99
02.09
02.09 / 0.17
7.
హోటళ్లూ
రెస్టారెంట్లు 


13,24,049



27.13
08.49



2.81
71.85



19.29
80.34
19.66



5.02



24.31



24.31 / 2.81
8.
రవాణా,
సమాచార
ప్రసారాలు

10.07
70.90
80.97
19.03
6.
టోకువ్యాపారం, చిల్లరవర్తకం
12.53
70.52
83.05
16.95
4.
విద్యుత్తు, గ్యాస్,
నీటి పంపిణీ
   93,133
01.90
18.73
0.36
74.34
1.41
93.08
06.92
0.13
01.54
01.55 / 0.36
10.
ప్రభుత్వ పాలన,
 రక్షణ
6,44,656
13.21
29.78
3.93
54.71
7.23
84.49
15.51
2.05
09.28
09.28 / 3.93
9.
ఆర్థిక వాణిజ్య
వ్యాపారాలు  
8,53,795
17.50
46.07
8.06
48.11
8.42
94.18
05.82
1.02
09.44
09.44 / 8.06

మొత్తం అంకెలలో
48,79,232
100.00
  14.83
17.26
59.63
56.99
-
25.50
25.72
82.73
82.73 / 17.26


ఆర్థిక కార్యాచరణ ద్వారా   (2004-05 స్థిరాంక ధరలలో) *స్తూలజాతీయోత్పత్తి= స్థూజాఉ ముందస్తు అంచనాలు కోట్ల రూ.లలో (2011). వ్యవసాయ అను.= వ్యవసాయం, పశుపాలన, చేపల పెంపకం. గ్రా. ఐన= గ్రాడ్యుయేట్లు ఐన; గ్రా. కాని= గ్రాడ్యుయేట్లు కాని; గ్రా.ఏతర= గ్రాడ్యుయేట్లు కాక మిగిలిన పనివారు;

అక్షరాస్యతలో వెనుకబాటుతనం: 36 రాష్ట్రాలూ కేంద్రపాలితప్రాంతాలలో మనది 32వ స్థానం. అది భారత సగటుకంటే 7 స్థానాల కింద. అక్షరాస్యతలో వెనుకబాటుతనానికి  రాష్ట్ర ఆర్థిక వెనుకబాటుతనం కారణంకాదు. తెలుగు రాష్ట్రాల స్తూలజాతీయోత్పత్తి భారతరాష్ట్రాలలో రెండు మూడుస్థానాలకు పోటీపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీషు మాధ్యమం 1981-1991 మధ్యన ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. అప్పటిదాకా మధ్యస్థంగా ఉన్నా 1991 నుండి నానాటికి తీసికట్టుగా మారి జాతీయ సగటు కంటే తగ్గి  ప్రతి దశాబ్దం కిందికి జారుతూ ఇప్పుడు తెలుగురాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలన్నిటికంటే తక్కువ అక్షరాస్యత కలిగివుండడమే గాక, అక్షరాస్యతలోనూ అభివృద్ధిలోనూ అట్టడుగునవున్న బీమారు (బీహారు, మధ్యప్రదేశ్, అరుణాచలప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాలవరుసలో చేరింది. ఇంకా చెప్పాలంటే మనపక్కనే ఉన్న ఒడిశా కంటే తక్కువలోకి దిగిపోయాం. మరి కారణం ఏమిటోనని వేదికితే అక్షరాస్యతలో మన తగ్గుబాటు ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశంతో మొదలైనట్లు తెలుస్తోంది. అంటే అక్షరాస్యతలో తక్కువ ఆర్థికంలో ఎక్కువను ఎట్లా అర్థంచేసుకోవాలి.


           పట్టిక-6 తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్) అక్షరాస్యత స్థాయి భారతదేశ సగటు అక్షరాస్యత స్థాయితో తులనం
జనాభా దశకం
భా.దే. అక్షరాస్యత%
సగటు
రాంకు
తె.రా.ల లో అక్షరాస్యత%
తె.రా.ల రాంకు
దేశ-రాష్ట్ర  
రాంకుల తేడా           
1951
18.33
(10)
-
-
-
1961
28.30
(14)
21.19
(21)
 -06
1971
34.45
(15)
24.57
(25)
 -10
1981
43.57
(18)
35.66
(23)
 -05
1991
52.21
(24)
44.08
(28)
 -04
2001
64.84
(23)
60.47
(29)
 -06
2011
74.04
(25)
67.66
(32)
 -07






పట్టిక-7 రాష్ట్రాల వారీ అక్షరాస్యత (శాతాలలో) (1951-2011)
క్ర.
సం.
రాష్ట్రాలు/
కేంద్రపాలిత
ప్రాంతాలు
1951
1961
1971
1981
1991
2001
2011 (P)
1.
బీహార్
13.49(13)
21.95(18)
23.17(29)
32.32(30)
37.49(34)
47.00(36)
63.82(36)
2.
అరుణా.
 ప్ర.
NA(36)
7.13(29)
11.29(34)
25.55(33)
41.59(30)
54.34(34)
66.95(35)
3.
రాజస్థాన్
8.5(20)
18.12(26)
22.57(30)
30.11(32)
38.55(33)
60.41(30)
67.06(34)
4.
జార్ఖండ్
12.93(15)
21.14(22)
23.87(28)
35.03(24)
41.39(31)
53.56(35)
67.63(33)
5.
ఆంధ్ర
ప్ర.
 –(35)
21.19(21)
24.57(25)
35.66(23)
44.08(28)
60.47(29)
67.66(32)
6.
జమ్మూ
కాశ్మీర్
–(34)
12.95(28)
21.71(31)
30.64(31)
NA(35)
55.52(33)
68.74(31)
7.
ఉత్తర
 ప్ర.
12.02(17)
20.87(23)
23.99(27)
32.65(28)
40.71(32)
56.27(32)
69.72(30)
8.
మధ్య
 ప్ర.
13.16(14)
21.41(20)
27.27(22)
38.63(21)
44.67(27)
63.74(25)
70.63(29)
9.
ఛత్తీస్
గఢ్
9.41(19)
18.14(25)
24.08(26)
32.63(29)
42.91(29)
64.66(24)
71.04(28)
10.
అస్సాం
18.53(9)
32.95(11)
33.94(17)
–(34)
52.89(23)
63.25(26)
73.18(27)
11.
ఒడిషా
15.80(11)
21.66(19)
26.18(23)
33.62(26)
49.09(26)
63.08(27)
73.45(26)
మొత్తం
భారత
దేశం
18.33(10)
28.30(14)
34.45(15)
43.57(18)
52.21(24)
64.84(23)
74.04(25)
12.
మేఘా
లయ
NA(33)
26.92(16)
29.49(21)
42.05(20)
49.10(25)
62.56(28)
75.48(24)
13.
కర్ణాటక
–(32)
29.80(13)
36.83(14)
46.21(15)
56.04(21)
66.64(21)
75.60(23)
14.
హర్యానా
–(31)
–(36)
25.71(24)
37.13(22)
55.85(22)
67.91(20)
76.64(22)
15.
పంజాబ్
–(30)
NA(35)
34.12(16)
43.37(19)
58.51(17)
69.65(16)
76.68(21)
16.
ప. బంగ్లా
24.61(5)
34.46(10)
38.86(11)
48.65(14)
57.70(19)
68.64(19)
77.08(20)
17.
దాన.
 హవేలి
–(29)
–(34)
18.13(32)
32.90(27)
40.71(32)
57.63(31)
77.65(19)
18.
గుజ
రాత్
21.82(7)
31.47(12)
36.95(13)
44.92(17)
61.29(14)
69.14(17)
79.31(18)
19.
ఉ.చల్
18.93(8)
18.05(27)
33.26(19)
46.06(16)
57.75(18)
71.62(14)
79.63(17)
20.
మణి
పూర్
12.57(16)
36.04(7)
38.47(12)
49.66(13)
59.89(16)
70.53(15)
79.85(16)
21.
నాగా
లాండ్
10.52(18)
21.95(17)
33.78(18)
50.28(11)
61.65(13)
66.59(22)
80.11(15)
22.
తమిళ
నాడు
–(28)
36.39(6)
45.40(10)
54.39(10)
62.66(12)
73.45(12)
80.33(14)
23.
సిక్కిం
–(27)
–(33)
17.74(33)
34.05(25)
56.94(20)
68.81(18)
82.20(13)
24.
మహా
రాష్ట్ర
27.91(4)
35.08(9)
45.77(9)
57.24(9)
64.87(10)
76.88(10)
82.91(12)
25.
హిమా.
 ప్ర.
–(26)
–(32)
 –(36)
 –(36)
63.86(11)
76.48(11)
83.78(11)
26.
అం. ని.
 దీ.
30.30(3)
40.07(5)
51.15(8)
63.19(7)
73.02(8)
81.30(7)
86.27(10)
27.
ఢిల్లీ
NA(25)
61.95(1)
65.08(3)
71.94(3)
75.29(6)
81.67(6)
86.34(9)
28.
చండీ
గఢ్
–(24)
NA(31)
70.43(1)
74.80(2)
77.81(4)
81.94(5)
86.43(8)
29.
పాండి
చ్చేరీ
–(23)
43.65(4)
53.38(5)
65.14(6)
74.74(7)
81.24(8)
86.55(7)
30.
దామన్
 దీ.
–(22)
–(30)
–(35)
–(35)
71.20(9)
78.18(9)
87.07(6)
31.
గోవా
23.48(6)
35.41(8)
51.96(6)
65.71(5)
75.51(5)
82.01(4)
87.40(5)
32.
త్రిపుర
NA(21)
20.24(24)
30.98(20)
50.10(12)
60.44(15)
73.19(13)
87.75(4)
33.
మిజో
రం
31.14(2)
44.01(3)
53.80(4)
59.88(8)
82.26(2)
88.80(2)
91.58(3)
34.
లక్ష
ద్వీప్
15.23(12)
27.15(15)
51.76(7)
68.42(4)
81.78(3)
86.66(3)
92.28(2)
35.
కేరళ
47.18(1)
55.08(2)
69.75(2)
78.85(1)
89.81(1)
90.86(1)
93.91(1)

























































అక్షరాస్యతలో అట్టడుగున నిలిచిపోవడానికి కారణం, విస్తరిస్తున్న ఇంగ్లీషు మాధ్యమమేనని తెలుస్తోంది. పాఠశాలవిద్యలో తెలుగురాష్ట్రాలలో (2002)  ప్రతి పది ప్రాథమిక పాఠశాలలలోనూ ఒకటి ఇంగ్లీషు మాధ్యమంకాగా (7,490 :: 74,654), ప్రాథమికోన్నత పాఠశాలలలో ప్రతి ఐదింటిలోనూ ఒకటి ఆంగ్లమాధ్యమమే (5258 :: 26075). ఇక, మాధ్యమిక పాఠశాలలలో ప్రతి నాలిగింటిలోనూ ఒకటి ఇంగ్లీషు మాధ్యమంకాగా (3,063::11,801), మాధ్యమికోన్నత పాఠశాలలలో ప్రతి రెండింటిలోనూ ఒకటి ఆంగ్ల మాధ్యమ పాఠశాలే (1,445::2,689).  భారతదేశపు సగటు అక్షరాస్యత కంటే తక్కువలో ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తం పది ఉండగా, ఈ పదిలో ఏడు ఆంగ్లమాధ్యమాన్ని అతిగా విస్తరించుకుంటున్నవే (బిహార్  ఝారఖండ్, ఆంధ్ర ప్రదేశ్, జమ్మూకశ్మీర్,   మధ్య ప్రదేశ్,   అస్సాం, ఒడీశా). అంటే అక్షరాస్యత తగ్గుదలకూ ఇంగ్లీషు మాధ్యమ విస్తరణకూ సాపేక్ష సంబంధం కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం  అంచెలంచెలుగా ప్రాథమిక స్థాయినుండి ప్రాథమికోన్నత, మాధ్యమిక, మాధ్యమికోన్నత స్థాయికి వెళ్లే ప్రతిచోటా బడిమానేసే పిల్లల శాతం(15%, 28%, 46%) గణనీయంగా పెరిగిపోతోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇంగ్లీషూ-మాతృభాషా మాధ్యమ పాఠశాలల నిష్పత్తీ, అక్షరాస్యత, స్థూలజాతీయోత్పత్తి, జనాభా స్థాయి కొలమానాలను  పోల్చిచూస్తే రాష్ట్రాలలో అక్షరాస్యత తరుగుదలకు   కారణాలలో ఒకటి విస్తరిస్తున్న ఇంగ్లీషు మీడియం అని కింద ఇచ్చిన పట్టికలో చూస్తే తెలుస్తుంది. జనాభాలో పెద్దవి కావటం, స్థూలజాతీయోత్పత్తిలో తక్కువగా ఉండటం జాతీయ స్థాయిలో అక్షరాస్యత తరుగుదలకు కొంతవరకు కారణమయినా, ఇంగ్లీషు మాధ్యమ విస్తరణకూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశ అక్షరాస్యత సగటు కంటే తక్కువ స్థాయిలో ఉన్న 11 రాష్ట్రాలలో 10  (బిహార్రాజస్థాన్, ఝారఖండ్, ఆంధ్ర ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీసగఢ్, అస్సాం, ఒడీశా) అధిక జనాభా గలిగిన (I వ శ్రేణి) రాష్ట్రాలే. ఆయితే సగటు స్థాయికంటే ఎగువ స్థాయిలో ఉన్న రాష్ట్రాలలో కూడా 10 (కర్ణాటక, గుజరాతు, పంజాబు, మహారాష్ట్ర, పశ్చిమబంగ్లా, ఉత్తరాఖండ్, హర్యాణాఢిల్లీ, తమిళనాడు, కేరళ) I వ శ్రేణి జనాభా రాష్ట్రాలు ఉన్నాయి. ఇక అక్షరాస్యత తక్కువ ఉన్న రాష్ట్రాలలో కూడా స్థూలజాతీయోత్పత్తి లో పైస్థాయి    రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లు    ఉన్నాయి. అంటే అధిక జనాభాగానీ స్థూల జాతీయోత్పత్తి స్థాయి గానీ అక్షరాస్యత తరుగుదలకు నిర్ణయాత్మకం కాదని తెలుస్తోంది.